తనకు నచ్చని కామెంట్లను, విమర్శలను ఆ పార్టీ తొలగించవచ్ఛునని, కానీ ప్రజల గొంతును మాత్రం నొక్కజాలదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచం ముందు మీ వాణిని వినిపిస్తాం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను, ప్రసంగాన్ని ‘డిస్ లైక్’ చేస్తూ వచ్చిన కామెంట్లను, అభిప్రాయాలను తన యూట్యూబ్ నుంచి తొలగించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్తలపట్ల స్పందించిన రాహుల్… పేరు పెట్టి ఆ పార్టీని ప్రస్తావించకుండా ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇటీవల మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని విమర్శిస్తూ అందుకున్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని రాహుల్ గుర్తు చేశారు. దీనికి లక్షల కొద్దీ డిస్ లైక్స్ వఛ్చినట్టు సమాచారం. లక్షలాది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నప్పటికీ జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని చాలామంది తప్పు పట్టారు.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని తాజాగా పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల కూడా స్పందించిన రాహుల్ గాంధీ… మోదీ ప్రభుత్వం పై నిప్పులు కక్కారు.
वो Dislike?, Comment? बंद कर सकते हैं,
लेकिन आपकी आवाज़ नहीं।हम आपकी बात दुनिया के सामने रखते रहेंगे।#RRBExamDates
— Rahul Gandhi (@RahulGandhi) September 5, 2020