పందెం కోడి…ప్రాణం తీసింది

|

Jan 15, 2020 | 9:35 PM

ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సిటీలో సెటిల్ అయినవాళ్లంతా ఊర్లకు వెళ్లి తమ, తమ బంధుమిత్రులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటున్నారు. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, బావా మరదళ్ల సరదాలు, గంగిరెద్దు, హరిదాసు కీర్తనలు. వీటన్నింటితో పాటే కోడి పందేలు కూడా. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వీటి జోరు ఎక్కువగా ఉంటుంది. పోలీసుల ఆంక్షలు సైతం లెక్క చెయ్యకుండా తమ సంప్రదాయాన్ని పాటిస్తారు. అయితే ఈ సారి కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది. […]

పందెం కోడి...ప్రాణం తీసింది
Follow us on

ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సిటీలో సెటిల్ అయినవాళ్లంతా ఊర్లకు వెళ్లి తమ, తమ బంధుమిత్రులతో ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటున్నారు. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, బావా మరదళ్ల సరదాలు, గంగిరెద్దు, హరిదాసు కీర్తనలు. వీటన్నింటితో పాటే కోడి పందేలు కూడా. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వీటి జోరు ఎక్కువగా ఉంటుంది. పోలీసుల ఆంక్షలు సైతం లెక్క చెయ్యకుండా తమ సంప్రదాయాన్ని పాటిస్తారు.

అయితే ఈ సారి కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ కోడికత్తి గుచ్చుకుని ఒకరు మరణించారు. వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం బరిలో ఈ విషాదం చోటుచేసుకుంది. పండుగ నేపథ్యంలో ఎప్పట్లానే గ్రామ శివార్లలోని పామాయిల్ తోటల్లో ఈ సారి బరులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పందెంలో పాల్గొనే కోళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సమీపంలో నిల్చుని ఉన్నారు. ఈ క్రమంలో ఓ కోడి బెదిరిపోయి ఒక్కసారిగా ఆయనపైకి దూకింది. ఆ కోడికి కట్టిన కత్తి ఆయన తొడ భాగంలో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే చింతలపూడి గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్లరు నిర్దారించారు. కాగా కోడి పందేల సమయంలో ఎప్పడూ ఇటువంటి దుర్ఘటన జరగలేదని చెప్తున్నారు గోదావరివాసులు.