‘క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి రాకూడదా’ ? తేజస్వి యాదవ్

| Edited By: Anil kumar poka

Nov 02, 2020 | 1:47 PM

బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీఎం నితీష్ కుమార్ మధ్య మాటల యుధ్ధం కొనసాగుతోంది. క్రికెట్ నుంచి తను రాజకీయాల్లోకి రావడాన్ని ప్రశ్నించిన నితీష్ కుమార్ పై తేజస్వి యాదవ్ మండిపడ్డారు.

క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి రాకూడదా ? తేజస్వి యాదవ్
Follow us on

బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీఎం నితీష్ కుమార్ మధ్య మాటల యుధ్ధం కొనసాగుతోంది. క్రికెట్ నుంచి తను రాజకీయాల్లోకి రావడాన్ని ప్రశ్నించిన నితీష్ కుమార్ పై తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఆ క్రీడ నుంచి నేను పాలిటిక్స్ లోకి ప్రవేశించకూడదా అని ప్రశ్నించారు. క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, అన్నీ తాను క్రికెట్ నుంచే నేర్చుకున్నానని ఆయన చెప్పారు. (ఒకప్పుడు తేజస్వి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఆడారు. పాలిటిక్స్ లోకి ఎంటర్ కాకముందు ఢిల్లీ ఐపీఎల్ టీమ్ సభ్యుడిగా ఉన్నారు). బీహార్ రెండో దశ ఎన్నికలకు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. నితీష్ అలసిపోయారని, ఇక ఈ రాష్ట్రాన్ని పాలించే ఓపిక ఆయనకు లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.