కోవిడ్ వ్యాక్సిన్ టీకాను వేయించుకున్న బీహార్, ఒడిశా సీఎంలు.. అభినందించిన ప్రధాని మోదీ..
Covid 19 Vaccination: దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల
Covid 19 Vaccination: దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు ఇవాళ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
Happy to share that I took my first dose of #COVID19 vaccine today. Grateful to our scientists, health workers for their race against time to deliver the vaccines to people.
Appeal to all eligible people to come forward and get vaccinated for a #CovidFreeOdisha. pic.twitter.com/aqqKSeb2ME
— Naveen Patnaik (@Naveen_Odisha) March 1, 2021
PM Modi ने आज राजधानी दिल्ली के एम्स अस्पताल में कोरोना वायरस वैक्सीन की पहली डोज लगवाई है | @narendramodi #COVID19 #COVAXIN | Read: https://t.co/JT7dOcbgBm pic.twitter.com/X1uU9Gcthp
— Newsroom Post (@NewsroomPostCom) March 1, 2021
టీకా తీసుకున్న తర్వాత బీహార్ సీఎం మాట్లాడుతూ.. ”బీహార్ రాష్ట్రమంతా టీకా ఉచితంగా అందుబాటులో ఉంటుందని.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తున్నామని.. దీనికి కావాల్సిన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుతం కల్పిస్తోందని” అన్నారు. ఇక ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. “ఇవాళ మొదటి మోతాదు కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాను. ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో శ్రమించిన శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు. కోవిడ్ ఫ్రీ ఒడిశా కోసం ప్రజలందరూ కూడా టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఎం మోదీ.. ”పుట్టినరోజు సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు విషెస్ చెప్పడమే కాకుండా బీహార్ రాష్ట్రం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు అభినందనలు తెలిపారు” అని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.
Best wishes to Bihar CM @NitishKumar Ji on his birthday. Under his leadership the NDA Government in Bihar is undertaking numerous measures for developing the state. Praying for his long and healthy life.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
కో-విన్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం కో-విన్ 2.0గా అప్‌గ్రేడ్ చేసింది.. రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
కొవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా cowin.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో కొవిడ్ టీకా తీసుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేసినా తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారు. రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!
Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!