బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా విజయ్ సిన్హా ఎన్నిక, 51 ఏళ్ళ తరువాత బీజేపీకే పదవీ యోగం

| Edited By: Anil kumar poka

Nov 26, 2020 | 10:57 AM

బీహార్ శాసన సభ స్పీకర్ గా బీజేపీకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. ఈ రాష్ట్రంలో 51 ఏళ్ళ తరువాత కమలం పార్టీకి ఈ పదవీ యోగం దక్కింది. విజయ్ సిన్హా స్పీకర్ గా ఎన్నికైనట్టు ప్రొ-టెమ్ స్పీకర్ జితన్ రామ్ మంజి ప్రకటించారు.

బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా విజయ్ సిన్హా ఎన్నిక, 51 ఏళ్ళ తరువాత బీజేపీకే పదవీ యోగం
Follow us on

బీహార్ శాసన సభ స్పీకర్ గా బీజేపీకి చెందిన విజయ్ సిన్హా ఎన్నికయ్యారు. ఈ రాష్ట్రంలో 51 ఏళ్ళ తరువాత కమలం పార్టీకి ఈ పదవీ యోగం దక్కింది. విజయ్ సిన్హా స్పీకర్ గా ఎన్నికైనట్టు ప్రొ-టెమ్ స్పీకర్ జితన్ రామ్ మంజి ప్రకటించారు. సిన్హాకు అనుకూలంగా 126 ఓట్లు, వ్యతిరేకంగా 114 ఓట్లు లభించాయన్నారు. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ తమ అభ్యర్థిగా ఈ పదవికి అవధ్ బిహారీ చౌదరిని నిలబెట్టింది. అయితే స్పీకర్ ఎన్నికకు ముందు కొంత రభస జరిగింది. రహస్య బ్యాలట్ ద్వారా ఎన్నిక జరగాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. సీఎం నితీష్ కుమార్, మరికొందరు సభా సభ్యులు కారని, వారు సభ నుంచి నిష్క్రమించాలని వారు కోరారు. కానీ ప్రతిపక్ష డిమాండ్లను స్పీకర్ తిరస్కరించారు. మొదట మూజువాణీ ఓటు ద్వారా ఎన్నిక జరిగినప్పటికీ ఆ తరువాత ‘హెడ్ కౌంట్’ జరగాలని జితన్ రామ్ మంజి ఆదేశించారు. చివరకు విజయ్ సిన్హాను నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆయన స్థానానికి తోడ్కొని వెళ్లారు.