Bigg Boss Telugu 4 : ఇదేం లెక్క బిగ్ బాస్, మరి ఇంత సేఫ్ గేమా!

|

Oct 07, 2020 | 12:09 PM

తెలుగు సీజన్‌కు సంబంధించి ఈసారి బిగ్ బాస్ లెక్క తప్పినట్లే అనిపిస్తుంది. బిగ్ బాస్ రూల్స్ సడలించిన సందర్బాలు చాలా అరుదనే చెప్పాలి.

Bigg Boss Telugu 4 : ఇదేం లెక్క బిగ్ బాస్, మరి ఇంత సేఫ్ గేమా!
Follow us on

తెలుగు సీజన్‌కు సంబంధించి ఈసారి బిగ్ బాస్ లెక్క తప్పినట్లే అనిపిస్తుంది. బిగ్ బాస్ రూల్స్ సడలించిన సందర్బాలు చాలా అరుదనే చెప్పాలి. కానీ ఈ సీజన్‌లో అలాంటి సీన్స్ లెక్కకుమించి కనిపిస్తున్నాయి. గంగవ్వను కంటెస్టెంట్‌గా సెలక్ట్ చెయ్యడం మొదట సహేతుకంగానే అనిపించినా, ఇప్పడు మాత్రం కాస్త తడబాటుగానే కనిపిస్తుంది. గంగవ్వ కారణంగా హౌస్‌లో చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆమెను అభిమానించేవారికి ఆగ్రహం కలగకుండా ఉండేందుకు, తమకు ఇబ్బంది ఉన్నా కూడా నామినేట్ చేయకుండా సైలెంట్‌గా నెట్టుకెళ్లిపోతున్నారు.

మోనల్‌కి సపోర్ట్, దివిపై మాటల తూటాలు :

హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో గంగవ్వకు, మోనల్‌కు పెద్దగా పొసగలేదు. మోనల్‌కు తెలుగు రాకపోవడంతో గంగవ్వ ఆమెతో అసలు మాట్లాడేది కూడా కాదు. అదే కారణంగా చూపిస్తూ తొలుతు మోనల్‌ నామినేట్ చేసింది కూడా. కానీ తర్వాత పరిణామాలు మారిపోయాయి. అఖిల్‌ను తన మనవడిలాగా ఫీలవుతోన్న గంగవ్వ, అతడితో సన్నిహితంగా మెలుగుతోన్న మోనల్‌కు వంత పాడటం మొదలెట్టింది. ఈ క్రమంలో వారి మధ్య బాండింగ్ పెరిగింది. మరోవైపు దివిపై ఇప్పటికే చాలాసార్లు మాటల తూటాలు సంధించింది. అయితే దివికి నామినేట్ చేయాలని ఉన్నా, నెగిటివిటి పెరిగిపోతుందన్న కారణంతో సైలెంట్‌గా ఉండిపోతుంది. వయసుతో పాటు వివిధ కారణాల వల్ల అన్ని టాస్కులలో కూడా గంగవ్వ భాగం కాలేకపోతుంది. మరి గంగవ్వను నామినేట్ చెయ్యకుండా ఇంకా ఎన్నాళ్లు సేఫ్ గేమ్ ఆడతారో చూడాలి.

ఫ్యాషన్ షోలో విన్నర్స్ ఎవరు బిగ్ బాస్:

ఇదేం లెక్క. ఫ్యాషన్ షోలో విజేతలు ప్రకటించే క్రమంలో జరిగిన పరిణామాలు హౌస్ మెంబర్స్ సేఫ్ గేమ్‌కు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. మనసులో వేరే, వేరే అభిప్రాయాలు ఉన్నా..ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గంగవ్వ, అవినాష్‌కు కిరిటాలు కట్టబెట్టారు. మరి బిగ్ బాస్ దీన్ని ఎలా అంగీకరించారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోలో ఇటువంటి పరిణామాలతో కాస్త ఇబ్బందికరమే.

పాపం కుమార్ సాయి :

వైల్డ్ కార్డ్ ద్వాారా ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి ఇప్పటికీ ఏకాకే. అతనికి మద్దతుగా నిలిచేవారు కానీ, బాధను పంచుకునేవారు ఎవరూ లేరు. తన గేమ్ తను ఆడకుంటూ వెళ్లిపోతున్నాడు అంతే. అయితే అతడి ఒంటరి పోరాటానికి ప్రకృతితో పాటు ప్రేక్షకుల మద్దతు కూడా లభిస్తుంది. ఈ క్రమంలోనే అసలు ఊహించని విధంగా అతడు ఈ వీక్ కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్ ట్యాగ్ ధరించడం చేత అతడిని ఈ వారం నామినేట్ చేయడానికి వీల్లేదు. లేకపోతే ఈ సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంచుమించు అరడజను మందిని అతడిని నామినేట్ చేసేవారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఫేట్ కుమార్ సాయిని ఇంకా ఎంతకాలం కాపాడుతుందో చూడాలి.

Also Read : రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి