AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BigBoss-4: సినిమా చాన్స్ కొట్టేసిన మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్… ఫేమ్‌ను క్యాష్ చేసుకుంటున్న బ్యూటీ..

Bigg Boss Contestant Got Movie Chance: బిగ్‌బాస్ రియాలిటీ షో ఓవైపు ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొంటున్న వారికి మంచి ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు సీజన్‌లలో ఎలా ఉన్నప్పటికీ..

BigBoss-4: సినిమా చాన్స్ కొట్టేసిన మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్... ఫేమ్‌ను క్యాష్ చేసుకుంటున్న బ్యూటీ..
Narender Vaitla
|

Updated on: Jan 25, 2021 | 6:30 PM

Share

Bigg Boss Contestant Got Movie Chance: బిగ్‌బాస్ రియాలిటీ షో ఓవైపు ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొంటున్న వారికి మంచి ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు సీజన్‌లలో ఎలా ఉన్నప్పటికీ బిగ్‌బాస్4లో పాల్గొన్న వారు మాత్రం ఈ షో ద్వారా లభించిన ఫేమ్‌ను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే సోహెల్‌, మోనాల్, అఖిల్, అభిజీత్, అరియానా, లాస్యలతో పాటు మరికొందరు సినిమా అవకాశాలు సొంతం చేసుకున్నారు. ఇక మరికొందరు స్టార్ మాలో ప్రసారమవుతోన్న కార్యక్రమాల్లో పాల్గొనే చాన్స్ కొట్టేశారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ దేత్తడి హారిక కూడా సినిమా అవకాశం కొట్టేసినట్లు సమాచారం. బిగ్‌బాస్ కంటే ముందు యూట్యూబ్‌లలో షార్ట్ ఫిలింల ద్వారా ఆకట్టుకున్న హారిక తాజాగా ఏకంగా సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హారిక స్వయంగా తెలిపింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న దేత్తడి హారిక తాజాగా ఓ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది. డిజిటల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇస్తోన్న హారిక ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read: Republic Motion Poster: ప్ర‌జాస్వామ్యానికి అర్థం చెబుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌… స‌రిదిద్దుకుంటూ స‌క్ర‌మంగా సాగాల‌ని స‌ల‌హా…

Follow Us