Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

|

Dec 11, 2020 | 7:35 PM

బిగ్ బాస్ తెలుగు‌ సీజన్‌ 4 ఎండింగ్‌కు వచ్చిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. బయట ఆర్మీలు తమ వాళ్లని గెలిపించేందుకు వ్యూహాలు పదునుపెట్టాయి. 

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..మాస్ కా బాప్ రాబోతున్నారట !
Follow us on

బిగ్ బాస్ తెలుగు‌ సీజన్‌ 4 ఎండింగ్‌కు వచ్చిన నేపథ్యంలో రసవత్తరంగా మారింది. బయట ఆర్మీలు తమ వాళ్లని గెలిపించేందుకు వ్యూహాలు పదునుపెట్టాయి.  ఎలక్షన్స్‌కు తగ్గకుండా ఓట్లకోసం లాబీయింగ్ చేస్తున్నారు.  ఈ వారం టాప్‌ 5లో నిలిచేది ఎవరో తేలిపోతుంది. వంద రోజులు కావటంతో హౌస్‌మెట్స్‌లో ఎమోషన్స్‌ ఓ రేంజ్‌కు చేరాయి. గంటగంటకు పరిణామాలు మారిపోతున్నాయి.  ఇంత రసవత్తరంగా సాగుతున్న బిగ్‌ బాస్‌ షోకు ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..అనేది ఇప్పుడు బిగ్ క్వచ్ఛన్‌గా మారింది. ఇప్పటికే పలువరు స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి కొన్ని లీకులు కూడా అందాయి. వారు కూడా ఈసారి తెలివిగా ఒకటి, రెండు పేర్లు కాకుండా..నాలుగైదు పేర్లను సర్కులేట్ చేస్తున్నారు.

మొన్నటి వరకు ఫినాలే గెస్ట్ నాగ చైతన్య లేదా మహేశ్ అన్న టాక్ గట్టిగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ మారిపోయింది. ఫైనల్ ఎపిసోడ్‌కు.. గెస్ట్‌ని కాకుండా సీనియర్‌ హోస్ట్‌ను బరిలో దించే ప్లాన్‌లో ఉందట బిగ్ బాస్‌ టీమ్. సీనియర్ అంటే యాక్టర్‌గా సీనియర్ కాదు.. బిగ్‌ బాస్‌ హోస్ట్‌గానే సీనియర్‌. ఈ షో ఫస్ట్ సీజన్‌ను హోస్ట్ చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన ఎన్టీఆర్‌.. ఫోర్త్‌ సీజన్‌ ఫినాలేకు అతిథిగా వస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అధికారిక సమాచారం లేపప్పటికీ..‌తారక్ వస్తే రేటింగ్‌ రికార్డులు బద్దలువుతాయంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ నిర్వాహకులకు హింట్ ఇస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read :

అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్​దీప్​​ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్

రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన

బుమ్రా కొట్టిన షాట్​కు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఆసీస్ బౌలర్​, నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న సిరాజ్ పరిగెత్తుకు వెళ్లి..