దొనకొండా..? అదెక్కడుంది..? : బొత్స సంచలన కామెంట్స్..

| Edited By:

Sep 10, 2019 | 2:11 PM

ఏపీలో కొద్ది రోజులుగా రాజధాని అంశం పైనే చర్చ జరుగుతోంది. తాజాగా రాజధాని అంశం పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. అయితే రాజధానిని మార్చే ప్రసక్తి లేదంటూ ఆ అంశం తమ మేనిఫెస్టోలో లేదని సీఎం వైఎస్ జగనే స్వయంగా చెప్పారు. కాగా, జగన్ విదేశాలకు వెళ్లిన సమయంలో రాజధాని అమరావతి విషయంలో బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి నిర్మాణం తాత్కాలికమే అని ఆయన వ్యాఖ్యలు […]

దొనకొండా..? అదెక్కడుంది..? : బొత్స సంచలన కామెంట్స్..
Follow us on

ఏపీలో కొద్ది రోజులుగా రాజధాని అంశం పైనే చర్చ జరుగుతోంది. తాజాగా రాజధాని అంశం పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. అయితే రాజధానిని మార్చే ప్రసక్తి లేదంటూ ఆ అంశం తమ మేనిఫెస్టోలో లేదని సీఎం వైఎస్ జగనే స్వయంగా చెప్పారు. కాగా, జగన్ విదేశాలకు వెళ్లిన సమయంలో రాజధాని అమరావతి విషయంలో బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి నిర్మాణం తాత్కాలికమే అని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇదంతా జగనే చేయిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం అమరావతి విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. బొత్స వ్యాఖ్యలను పట్టుకుని విపక్షాలు నానా రాద్దాంతం చేశాయి. కాగా, అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని వైసీపీ నేతలే వివరణ ఇచ్చుకున్నారు. అయితే బొత్స మాత్రం అమరావతి విషయంలో తన వాయిస్‌ను వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా అమరావతికి పిన్ కోడ్ కూడా లేదన్నారు. ఆ మధ్య కొత్త రాజధాని దొనకొండను చేయవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. అసలు అదెక్కడుందో కూడా తనకు తెలియదని బొత్స సంచలన కామెంట్స్ చేయడం విశేషం. ఇక అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని చెప్పిన ఆయన.. అన్నీ అక్రమ నిర్మాణాలు చేపట్టి అమరావతిని తాత్కాలికంగా చేశారని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇష్టం వచ్చినట్లు మోసం చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉండి కూడా ఏపీలో సొంత ఇల్లు ఎందుకు నిర్మించుకోలేదని ప్రశ్నించారు. రాజధానిని తాత్కాలికంగా నిర్మించడం వల్లే.. ఇప్పుడు పెట్టుబడులు రాకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకే రివర్స్ టెండరింగ్‌కి వెళ్లామని అన్నారు. తన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని చంద్రబాబు భయపడుతున్నారని సెటైర్ వేశారు.

మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పై కూడా బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బినామి అని.. అందుకే రాజధాని విషయంలో టీడీపీ వాయిస్‌ను పవన్ వినిపిస్తున్నారని అన్నారు. అంతేకాదు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో ఎవరికి న్యాయం జరగలేదన్నారు. అటు అధికారంలో ఉన్నవారే రాజధాని నిర్మాణం గురించి మాట్లాడటం.. మళ్లీ వారే సర్దిచెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.