‘భీష్మ’ నడుం పట్టుకు.. ఆదరణ అదుర్స్!

|

Nov 09, 2019 | 7:42 PM

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్స్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. యువతను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ వీడియో తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ‘నా ప్రేమ కూడా విజయ్ మాల్యలాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’ అని నితిన్ చెప్పిన డైలాగు బాగా ఆకట్టుకుంది. […]

భీష్మ నడుం పట్టుకు.. ఆదరణ అదుర్స్!
Follow us on

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్స్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. యువతను ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ వీడియో తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందింది.

‘నా ప్రేమ కూడా విజయ్ మాల్యలాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’ అని నితిన్ చెప్పిన డైలాగు బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా బ్యా‌గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా సూట్ అయింది. దీంతో ఈ వీడియో భారీగా వ్యూస్ సాధించడమే కాకుండా యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇక దీనిపై హీరో నితిన్ స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.