పేలుడు శిథిలాల మధ్య పియానో ప్లే చేసిన బామ్మ

|

Aug 06, 2020 | 12:35 PM

అప్పుడేప్పుడో ప్రాణాలుపోతున్నాయంటే ఫిడేలు వాయిస్తున్నారని విన్నాం. ఇప్పుడు కూడా అలాంటి సీన్ ఒకటి రిఫిట్ అయ్యింది. భారీ పేలుడుతో నగరం నాశనమవుతుంటే.. ఓ బామ్మ ఎంచక్కా పియానో ప్లే ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పేలుడు శిథిలాల మధ్య పియానో ప్లే చేసిన బామ్మ
Follow us on

అప్పుడేప్పుడో ప్రాణాలుపోతున్నాయంటే ఫిడేలు వాయిస్తున్నారని విన్నాం. ఇప్పుడు కూడా అలాంటి సీన్ ఒకటి రిఫిట్ అయ్యింది. భారీ పేలుడుతో నగరం నాశనమవుతుంటే.. ఓ బామ్మ ఎంచక్కా పియానో ప్లే ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లెబ‌నీస్ రాజ‌ధాని బీరుట్లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో వంద‌లాది మంది మ‌ర‌ణించారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఒక్క‌సారిగా న‌గ‌రం మొత్తం భీకరంగా మారిపోయింది. ఈ సంఘటన ప్రపంచ దేశాలను సైతం ఉలికిపడేలా చేసింది. అయితే, పాత బీరుట్ నివాసి 79 ఏండ్ల బామ్మ త‌న అపార్ట్‌మెంట్‌లో పేలుళ్లల మ‌ధ్య ప్ర‌శాంతంగా పియానో ప్లే చేస్తున్న‌ది.

ఇల్లంతా ధ్వంస‌మైపోయి చిందర వందరగా మారిపోయింది. ఎక్కడ వ‌స్తువులు అక్క‌డ కింద ప‌డిపోయి పగిలిపోయి అంతా నాశ‌నం అయిపోయింది. అయితే, పేలుడు సంభవించిన స‌మ‌యంలో ఆ బామ్మ తన అపార్ట్‌మెంట్‌లో లేరు. ఇంటికి వ‌చ్చేస‌రికి 60 ఏండ్ల నుంచి నివ‌శిస్తున్న ఇల్లు అంతా నాశనమైపోయింది. దీంతో తట్టుకోలేక మానిసిక ప్రశాంతత కోసం త‌న పెళ్లి రోజున గిఫ్ట్‌గా ఇచ్చిన పియానోను ప్లే చేస్తూ ఈ ప్ర‌మాదాన్ని మ‌ర్చిపో‌వాల‌నుకున్న‌ది. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను త‌న మ‌న‌వ‌రాలు మెల్కీ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది.