మరోసారి రికార్డులను బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు

| Edited By:

Sep 12, 2019 | 11:04 AM

బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది కంటే ఈ సారి మరో లక్ష రూపాయలు ఎక్కువ పలికింది. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి సోంతం చేసుకున్నారు. ఈ సారి లడ్డూను దక్కించుకునేందుకు 28 మంది పోటీ పడ్డారు. గతేడాది.. బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సారి లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డికి ఉత్సవ కమిటీ శాలువతో సత్కరించి లడ్డూను అందజేసింది. అనంతరం శోభాయాత్ర […]

మరోసారి రికార్డులను బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డు
Follow us on

బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది కంటే ఈ సారి మరో లక్ష రూపాయలు ఎక్కువ పలికింది. 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి సోంతం చేసుకున్నారు. ఈ సారి లడ్డూను దక్కించుకునేందుకు 28 మంది పోటీ పడ్డారు. గతేడాది.. బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సారి లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డికి ఉత్సవ కమిటీ శాలువతో సత్కరించి లడ్డూను అందజేసింది. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర చార్మినార్ పాతబస్తి మీదుగా వినాయక్ సాగర్‌కు చేరుకుంటుంది.

తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డూ వేలం పాటను ప్రారంభమైంది. మొదట రూ. 450తో ప్రారంభమైన వేలం.. ప్రతి ఏడాది వందల.. వేలు.. లక్షలకు చేరుకుంది. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలు విరజిల్లుతాయని.. పసిడి పంటలు పండుతాయని స్థానికుల విశ్వాసం. అంతేకాదు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న వారు కూడా ఇదే చెబుతుంటారు.
అయితే ఈ లడ్డూను తాపేశ్వరం హనీఫుడ్స్ తయారు చేస్తుంది. 21 కిలోల బరువు ఉండే ఈ లడ్డూను 2010 నుంచి బాలాపూర్ గణేష్‌డికి తాపేశ్వరం హనీఫుడ్స్ యజమాని నైవేద్యంగా సమర్పిస్తున్నారు.

గణేష్ నవరాత్రులు ప్రారంభం నుంచి పోటీ పడుతున్న వారి నుంచి నిర్వాహకులు దరఖాస్తులు తీసుకుంటారు. మొదట వేలం పాట రూ. 1116తో స్టార్ట్ అవుతుంది. లడ్డూను దక్కించుకున్న వారు బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ లడ్డూ ద్వారా వచ్చిన ధనాన్ని.. ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది.

ఇక 1994 – 1995లో లడ్డును కోలన్ మోహన్ రెడ్డి దక్కించుకోగా.. 1996-1997లో కోలన్ కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. 1998లో కోలన్ మోహన్ రెడ్డి.. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి, 2000లో కల్లెం అంజిరెడ్డి, 2001 రఘునందన్ చారి, 2002లో కందాడ మాధవ రెడ్డి 2003లో చిగిరింత బాల్ రెడ్డి, 2004లో కోలన్ మోహన్ రెడ్డి, 2005లో ఇబ్రహీం శేఖర్, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి, 2007లో రఘునందన్ చారి, 2008లో కోలన్ మోహన్ రెడ్డి, 2009లో సరిత, 2010లో కొడాలి శ్రీధర్ బాబు, 2011లో కోలన్ బ్రదర్స్ సొంతం చేసుకున్నారు.

2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి, 2013లో తీగల కృష్ణారెడ్డి, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి, 2015లో కోలన్ మదన్ మోహన్ రెడ్డి, 2016లో స్కైలాబ్ రెడ్డి, 2017 నాగం తిరుపతిరెడ్డి, 2018లో శ్రీనివాస్ గుప్తా బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.