
బేకర్స్ అసోసియేషన్ కేరళకు చెందిన వందల మంది బేకర్లు, షెఫ్‌లు ఒక్కటయ్యారు. దీంతో ప్రపంచ రికార్డు వారి సొంతమయ్యింది. కేరళ తీరప్రాంత పట్టణం త్రిసూర్‌లోని నలభీములు ప్రపంచంలోనే అతి పొడవైన కేకును తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కెక్కారు. 5.3 కిలోమీటర్లు పొడవు, 10 సెంటీమీటర్ల మందం ఉన్న ఈ కేక్ 27,000 కిలోల బరువుంది. దీని తయారీకి 12,000 కిలోల పంచదార, మైదాలను వాడారు. ఈ వెనీలా కేక్‌ను మరింత రుచికరంగా చేయటానికి దానిని చాకోలేట్ పూతతో అలంకరించారు. ఈ రికార్డును చూడటానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
5.3 కిలోమీటర్ల పొడవున్న ఈ కేక్‌ను గిన్నిస్ సంస్థకు చెందిన ప్రతినిధులు పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే కచ్చితంగా దీని కొలతలను నమోదు చేసిన అనంతరం ప్రపంచ రికార్డును ప్రదానం చేస్తారని బేక్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ అతి పొడవైన కేకుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
[svt-event date=”17/01/2020,5:22PM” class=”svt-cd-green” ]
And the icing on the cake – a certificate presentation ? pic.twitter.com/T9UJZsZdhz
— GuinnessWorldRecords (@GWR) January 15, 2020