కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..

నల్లచిరుతలు చాలా అరుదుగా ఉంటాయి. కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ ఈ చిరుతకు సంబంధించిన ఫోటోలను

కర్ణాటకలో అడవుల్లో ‘బగీరా’.. వైరల్ అవుతున్న ఫోటోలు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2020 | 9:36 PM

నల్లచిరుతలు చాలా అరుదుగా ఉంటాయి. కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ ఈ చిరుతకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కబినీ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను తాను చూసినట్లు ఆయన తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. దాదాపు 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నాయి.

ఇటీవల ఒక నల్ల చిరుతపులి (బ్లాక్ పాంథర్) దక్షిణ గోవాలోని నేత్రావళి అభయారణ్యంలో తిరుగుతున్నట్లుగా ఓ ఫోటో వైరల్ అయింది. అయితే.. ఈ ఫోటోలు చూసి జంగిల్ బుక్‌లో మాదిరిగా భారత్‌లో  నిజంగా బగీరా కనిపించిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూడాలని, ప్రకృతిని ఆస్వాదించాలని అభిప్రాయపడ్డాడు. జంగిల్ బుక్ కామిక్‌లోని బగీరా ఇదేనంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.

[svt-event date=”06/07/2020,9:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]