అయోధ్యలో మందిర నిర్మాణంతో బాటు మరిన్ని ప్రాజెక్టులు

అయోధ్యలో రామ మందిరంతో బాటు మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రామాలయ నిర్మాణ లేఔట్ కి  అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ  గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..

అయోధ్యలో మందిర నిర్మాణంతో బాటు మరిన్ని ప్రాజెక్టులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 03, 2020 | 8:50 PM

అయోధ్యలో రామ మందిరంతో బాటు మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రామాలయ నిర్మాణ లేఔట్ కి  అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ  గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక చకచకా గుడి నిర్మాణం ఆరంభం కానుంది. ఈ లేఔట్ 2.74 లక్షల చదరపు మీటర్లతో కూడినది కాగా-12,879 చదరపు మీటర్ల ఏరియాలో ఆలయ నిర్మాణం జరుగుతుందని ట్రస్ట్ వెల్లడించింది. అటు ధ్యాన మందిరం, ఆధ్యాత్మిక కేంద్రం వంటివి కూడా ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని ట్రస్ట్ పేర్కొంది. దేశ వ్యాప్తంగా భక్తులు ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవచ్చునని స్పష్టం చేసింది.