AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బిల్ బోర్డును తొలగిస్తారా ?సుశాంత్ సోదరి ఆగ్రహం

తన సోదరుడు సుశాంత్ కి న్యాయం జరగాలంటూ రాసి ఉన్న బిల్ బోర్డును అమెరికాలో తొలగించారని అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి మండిపడింది. సదరు హాలీవుడ్ కంపెనీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది..

ఆ బిల్ బోర్డును తొలగిస్తారా ?సుశాంత్ సోదరి ఆగ్రహం
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 03, 2020 | 8:36 PM

Share

తన సోదరుడు సుశాంత్ కి న్యాయం జరగాలంటూ రాసి ఉన్న బిల్ బోర్డును అమెరికాలో తొలగించారని అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి మండిపడింది. సదరు హాలీవుడ్ కంపెనీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బిల్ బోర్డు ఏర్పాటుకు తాను సొమ్ము చెల్లించానని, కానీ ముందే దాన్ని తొలగించారని ఆమె పేర్కొంది. ఆ బిల్ బోర్డు తాలూకు ఫోటోను ఈ-మెయిల్ ద్వారా ఆమె పంపింది. అయితే మీతో అగ్రిమెంట్ ను మేము రద్దు చేసుకుంటున్నామని, మీ సొమ్మును రీఫండ్ చేస్తామని ఆ సంస్థ తెలిపినట్టు ఆమె వెల్లడించింది. ఏమైనా సదరు కంపెనీ చర్యను శ్వేత తీవ్రంగా గర్హించింది. తన సోదరునికి న్యాయం జరగాలంటూ ఆమె ఆ బిల్ బోర్డును ఏర్పాటు చేయించింది.

Follow Us