AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య తీర్పు: హద్దు మీరితే అంతే ..

వివాదస్పద అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలవరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ సమాచారం అందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. నిన్న ఉదయం యూపీ అధికారులతో సీజేఐ సమావేశమయ్యారు.ఈ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనుండటంతో నేడు  తీర్పు వెలువరించనుంది. అత్యంత సున్నితమైన సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు […]

అయోధ్య తీర్పు: హద్దు మీరితే అంతే ..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 09, 2019 | 10:42 AM

Share

వివాదస్పద అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలవరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ సమాచారం అందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. నిన్న ఉదయం యూపీ అధికారులతో సీజేఐ సమావేశమయ్యారు.ఈ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనుండటంతో నేడు  తీర్పు వెలువరించనుంది. అత్యంత సున్నితమైన సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో 2.77 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. హిందు సంస్థ నిర్మోహి అకాడా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, రామ్ లాల్ల మధ్య వివాదం ఉంది.

అయితే తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో..శాంతిభధ్రతల నిమిత్తం కేంద్రం సమాచార వ్యవస్థపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హృద్రేకపరిచే, రెచ్చగొట్టే సందేశాలు పంపకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సున్నితమైన అంశం కాబట్టి నియంత్రణను ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరింది.

1.అన్ని కాల్స్ పరిశీలనలో ఉంచబడతాయి 2. శాంతిభద్రతల దృష్యా కాల్ రికార్డింగ్స్ సేవ్ చేయబడతాయి 3. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలనలో ఉంచబడతాయి 4. ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ హోం మంత్రిత్వ శాఖ వ్యవస్థలకు అనుసంధానించబడతాయి. 6. ఎవరికీ తప్పుడు సందేశాలు జారీ చేయకుండా ముందస్తు హెచ్చరికలు 7. మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు మొదలైనవారికి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని మరియు సామాజిక సైట్‌లను తక్కువగానే నడపాలని తెలియజేయండి. 8. రాజకీయాలు లేదా ప్రస్తుత పరిస్థితులపై మీరు ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా స్వీకరించే అభ్యంతరకరమైన పోస్ట్ లేదా వీడియో .. మొదలైనవి పంపవద్దు. 9. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యపై ఏదైనా అభ్యంతరకరమైన సందేశాన్ని రాయడం లేదా పంపడం నేరం…. అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. 10. పోలీసులు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటారు… సైబర్ క్రైమ్ అధికారులు చర్యలు తీసుకుంటారు. 11. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో..భావవిరుద్దమైన ప్రకటనలు నేరపూరితమైనవిగా పరిగణించబడతాయి

తీర్పు వెల్లడికి ముందుగాని, తర్వాతగానీ వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌తో సహా ఏ సోషల్‌ మీడియా మాధ్యమం ద్వారానైనా హింసను ప్రేరేపించేలా, మతవిద్వేషాలను రగిలించేలా, విద్వేషపూరిత పోస్టింగ్స్ వేస్తే గ్యాంగ్‌స్టర్ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఎ) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ వీఎన్ సింగ్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. నోయిడాలో మాత్రమే గాక దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాలు కూడా ఇదే విధమైన ఆదేశాలను తమ తమ పరిధులలో జారీ చేశాయి.