కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో యువతిపై అటెండర్ లైంగికదాడి

ఓ దుర్మార్గుడు క్వారంటైన్ లో ఉన్న యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో యువతిపై అటెండర్ లైంగికదాడి
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 13, 2020 | 5:51 PM

కన్నుమిన్ను కానరాని కామాంధులు తెగబడుతున్నారు. ప్రభుత్వాలు ఎట్టిచట్టాలు చేసిన కీచకులు బరితెగిస్తూనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా వదిలిపెట్టడంలేదు. తాజాగా ఓ దుర్మార్గుడు క్వారంటైన్ లో ఉన్న యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స 20 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన అటెండర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్‌లో జరిగింది. అయితే సదరు మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవ్‌ఘర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బారిన పడ్డ బంధవు మీరా రోడ్డు ప్రాంతంలోని క్వారంటైన్‌ సెంటర్‌లో చికిత్సపొందుతున్నారు. బంధవును చూసుకునేందుకు ఆ మహిళ తన 10 నెలల కూతురుతోపాటు ఫెసిలిటీలోని ఓ గదిలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. యువతిపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

రాత్రి సమయంలో నిందితుడు వేడినీళ్ల నెపంతో అక్కడికి వచ్చేవాడని, ఈ క్రమంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రతిఘటిస్తే తన బిడ్డను చంపుతానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. జూన్‌ మొదటివారంలో మూడు సందర్భాల్లో గదిలో ఉన్న మహిళపై అటెండర్‌ మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు తన కుటుంబ సభ్యులకు హాని తలపెడుతాడని భయంతో ఇంతకాలం ఓపిక పట్టినట్లు మహిళ పోలీసులకు వివరించింది. మహిళ ఫిర్యాదు కేసు నమోదు చేసి, అటెండర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.