ఆ నేతలను నిందితులంటారా ? ఢిల్లీ పోలీసులపై చిదంబరం ఫైర్,

ఢిల్లీ పోలీసులు క్రిమినల్ జస్టిస్ సిస్టంని హాస్యాస్పదం చేశారని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. గత ఫిబ్రవరిలో  సీ ఏఏ కి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరిని..

ఆ నేతలను నిందితులంటారా  ? ఢిల్లీ పోలీసులపై చిదంబరం ఫైర్,
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 6:02 PM

ఢిల్లీ పోలీసులు క్రిమినల్ జస్టిస్ సిస్టంని హాస్యాస్పదం చేశారని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. గత ఫిబ్రవరిలో  సీ ఏఏ కి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరిని, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ ను మరికొందరిని సహకుట్రదారులుగా పోలీసులు తమ అనుబంధ చార్జిషీట్ లో ప్రస్తావించడాన్ని ఆయన తప్పు పట్టారు.సమాచారానికి, చార్జిషీట్ కి మధ్య ఇన్వెస్టిగేషన్,  సమన్వయం అనే ముఖ్యమైన అంశాలు ఉంటాయనన్న విషయాన్ని వారు మర్చిపోయారు అని ఆయన అన్నారు. ఢిల్లీ అల్లర్లలో సీతారాం ఏచూరిని, ఇతర మేధావులను నిందితులుగా పేర్కొని పోలీసులు క్రిమినల్ జస్టిస్ ని హాస్యాస్పదం చేశారని ఆయన ఆరోపించగా..ఢిల్ఝి ఖాకీలు వెంటనే వివరణ ఇచ్చారు. తాము ఏచూరి తదితరులను నిందితులుగా ఈ చార్జిషీట్ లో చెప్పలేదని, తగినన్ని ఆధారాలు ఉంటేనే తదుపరి లీగల్ చర్య కోసం ఉపక్రమించామన్నారు. ప్రస్తుతం ఈ చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉందన్నారు.

పార్లమెంట్ సమావేశాలు జరగడానికి రెండు రోజుల ముందు ఈ అనుబంధ చార్జిషీట్ ను పోలీసులు దాఖలు చేయడం విశేషం. అయితే తమ పార్టీ ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు.