Hyderabad: ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణపై దాడికి యత్నం.. ఎందుకంటే..?

టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో.. బెస్ట్ రైటర్‌గా పేరు తెచ్చుకున్నారు చిన్నికృష్ణ. తాజాగా ఆయనపై దాడి జరగడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణపై దాడికి యత్నం.. ఎందుకంటే..?
Chinni Krishna

Updated on: Feb 19, 2022 | 4:08 PM

Telangana: ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ(Chinni krishna)పై కొందరు రియల్టర్లు దాడికి ప్రయత్నించారు. దీనికి ఒక భూవివాదమే కారణమని తెలుస్తోంది. శంకర్‌పల్లి గ్రామపంచాయితీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడంతో.. హైకోర్టును ఆశ్రయించిన చిన్నికృష్ణ స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానిక రియల్టర్లు.. చిన్నికృష్ణపై దాడికి యత్నించారు. పరుష పదజాలంతో దూషించారని చిన్నికృష్ణ తెలిపారు. ఈ ఘటనపై శంకర్‌పల్లి పీఎస్‌(Shankarpalli Police Station)లో ఫిర్యాదు చేశారు చిన్నికృష్ణ. కొవిడ్‌తో ఇబ్బందిపడుతున్న తనను… ఇంట్లోకి చొచ్చుకొచ్చి బెదిరించారని చెప్పారు చిన్నికృష్ణ. స్థానిక గ్రామపంచాయితీవారు.. తన స్థలానికి క్లియర్‌ పిక్చర్‌ ఇచ్చారనీ చెప్పారు. అయినప్పటికీ కావాలని వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టులను కూడా అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాడి విషయం తెలియగానే.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు.. చిన్ని కృష్ణకు ఫోన్ చేసి.. ఆరా తీశారు.

 

Also Read: ఇంటి బేస్‌మెంట్‌ కింద రహస్య అర.. అందులోకెళ్లి చెక్ చేసిన పోలీసులు షాక్

ఊరంతా నిర్మానుష్యం.. పశువులతో సహా మాయం.. అసలు ఏమిటీ చిత్రం..?