పిచ్‌ను హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టారు. ఫ్యాన్స్ నెట్టింట్లో ఉతికి ఆరేశారు.!

న్యూ ఇయర్‌ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించాలని భావిస్తే.. వరుణుడికి ఇంకో ప్లాన్స్ ఉన్నట్లు ఉన్నాయి. వారి ఆశలపై నీరు చల్లుతూ.. మొదటి టీ20 మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశాడు. ఇక పిచ్‌పై ఉన్న ప్యాచ్‌లను ఆరబెట్టడానికి అస్సాం క్రికెట్ అసోసియేషన్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారంతా ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రయర్, వ్యాక్యూమ్ క్లీనర్‌తో అవస్థలు పడిన విషయం విదితమే. ఇక దీనికి సంబంధించిన ఫోటోలతో నెట్టింట్లో తీవ్రమైన […]

పిచ్‌ను హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టారు. ఫ్యాన్స్ నెట్టింట్లో ఉతికి ఆరేశారు.!
Follow us

|

Updated on: Jan 06, 2020 | 5:55 PM

న్యూ ఇయర్‌ను టీమిండియా అద్భుత విజయంతో ఆరంభించాలని భావిస్తే.. వరుణుడికి ఇంకో ప్లాన్స్ ఉన్నట్లు ఉన్నాయి. వారి ఆశలపై నీరు చల్లుతూ.. మొదటి టీ20 మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశాడు. ఇక పిచ్‌పై ఉన్న ప్యాచ్‌లను ఆరబెట్టడానికి అస్సాం క్రికెట్ అసోసియేషన్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారంతా ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రయర్, వ్యాక్యూమ్ క్లీనర్‌తో అవస్థలు పడిన విషయం విదితమే. ఇక దీనికి సంబంధించిన ఫోటోలతో నెట్టింట్లో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. కొందరు గ్రౌండ్ సిబ్బందిని విమర్శిస్తే.. మరికొందరు పిచ్‌ను ఆరబెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా అని మండిపడుతున్నారు.

‘పిచ్‌ను ఆరబెట్టడానికి పిల్లలు హెలికాఫ్టర్ వాడితే.. లెజెండ్స్ ఇస్త్రీ పెట్టె, హెయిర్ డ్రయర్ ఉపయోగిస్తున్నారని ఒక వ్యక్తి మేమె చేస్తే.. ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డు బీసీసీఐ పిచ్‌ను డ్రయర్‌తో ఆరబెడుతున్నారని కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే మ్యాచ్ రద్దు కావడానికి వర్షం కంటే నిర్వహణ సిబ్బంది లోపమే ఎక్కువ శాతం ఉందని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తప్పకుండా చర్యలు చేపడతారని అందరూ భావిస్తున్నారు.