చైనా ఆర్మీ చెరలో ఐదుగురు భారతీయులు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

|

Sep 05, 2020 | 10:40 AM

అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచల ఆరోపణలు చేశారు. ఐదుగురు స్థానికులను చైనా సైన్యం అపహరించిందంటూ వెల్లడించారు. వారిని వెంటనే విడిపించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

చైనా ఆర్మీ చెరలో ఐదుగురు భారతీయులు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Follow us on

అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచల ఆరోపణలు చేశారు. ఐదుగురు స్థానికులను చైనా సైన్యం అపహరించిందంటూ వెల్లడించారు. వారిని వెంటనే విడిపించాలంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

చైనాతో సరిహద్దు సమస్య కొనసాగుతుండగానే మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా బలగాలు అపహరించినట్లు ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా ఆర్మీ తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైన్యం ఎలాంటి సమాచారం లేకుండా అపహరించిందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వారి జాడ ఇంతవరకు తెలియలేదన్నారు. ఈ మేరకు నిన్నాంగ్ ఎరింగ్ నేరుగా ప్రధాని కార్యాలయానికే ట్వీట్ చేశారు. ప్రధాని మంత్రి చొరవ తీసుకుని స్థానికులను విడిపించాలన్నారు.