రొమ్ము క్యాన్సర్: వాయిస్ ఆధారిత యాప్ ‘షీలా జీ’ ఆవిష్కరణ.. తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో కూడా..

|

Dec 16, 2020 | 7:15 PM

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు క్యూ యువర్ హెల్త్ ఇండియా వారు 'షీలా జీ' అనే వాయిస్ ఆధారిత యాప్‌ను ఆవిష్కరించారు.

రొమ్ము క్యాన్సర్: వాయిస్ ఆధారిత యాప్ షీలా జీ ఆవిష్కరణ.. తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో కూడా..
Follow us on

Sheila Ji App: రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు క్యూ యువర్ హెల్త్ ఇండియా వారు ‘షీలా జీ’ అనే వాయిస్ ఆధారిత యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్‌ను తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో కూడా ప్రవేశపెట్టారు.  ప్రస్తుతం ‘షీలా జీ’ యాప్ రొమ్ము క్యాన్సర్, కీమోథెరపీ రోగులకు అందుబాటులో ఉంటుంది. ఇంట్లో ఉండే గ్లూకో మీటర్, బ్లడ్ ప్రెజర్ మోనికర్, పల్స్ ఆక్సిమీటర్, వెయింగ్ స్కేల్, థర్మామీటర్ వంటి ఆరోగ్య సాధనాల నుంచి ఈ షీలా జీ, రోగుల తాలూకు కీలక సమాచారాన్ని వాయిస్, టెక్ట్స్, ఐఒటీ సాధనాలను ఉపయోగించి రికార్డు చేస్తుంది.

ఈ యాప్‌కు సంబంధించిన ఏఐ నమూనా రోగుల తాలూకు డిజిటల్ సంతకాలను గుర్తించి, క్లినికల్ థెరపీలకు ముందు, తరువాత స్థితులు చేయాల్సినవి, చేయకూడనివి గుర్తు చేయడమే కాకుండా అపాయింట్‌మెంట్‌తో సహా వ్యాధి స్థితిగతుల్ని నిర్వహించుకోవడానికి సాయపడుతుంది. షీలా జీ “మైఎఫ్‪హెచ్‪బీ” యాప్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఒఎస్ స్టోర్స్‌లో ఉచితంగా లభిస్తుంది.