Crime News : అనంతపురం జిల్లాలో తెగించిన పేకాట రాయుళ్లు, ఏకంగా మొబైల్‌ పేకాట సెంటర్ ఏర్పాటు

|

Dec 24, 2020 | 2:30 PM

ఓ వైపు ప్రజలంతా కరోనా వైరస్‌ భయానికి సామాజిక దూరం అంటుంటే, అనంతపురం జిల్లాలో పేకాట రాయుళ్లు మాత్రం యద్ధేచ్చగా తమ తతంగం కానిస్తున్నారు. కాస్త కూడా భయంలేకుండా గుంపులు గుంపులుగా పేకాట ఆడుతున్నారు.

Crime News : అనంతపురం జిల్లాలో తెగించిన పేకాట రాయుళ్లు, ఏకంగా మొబైల్‌ పేకాట సెంటర్ ఏర్పాటు
Follow us on

ఓ వైపు ప్రజలంతా కరోనా వైరస్‌ భయానికి సామాజిక దూరం అంటుంటే, అనంతపురం జిల్లాలో పేకాట రాయుళ్లు మాత్రం యద్ధేచ్చగా తమ తతంగం కానిస్తున్నారు. కాస్త కూడా భయంలేకుండా గుంపులు గుంపులుగా పేకాట ఆడుతున్నారు. మడకశిర మండలంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. మండలంలోని పత్తికుంట గ్రామశివారులో పేకాట రాయుళ్ల ఆట కట్టించారు.  రామ్‌ లక్ష్మణ్‌ అనే జూదరుల టీమ్‌ను, 10 మంది జూదరులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 62వేల నగదు, 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే… మడకశిరలో తాజాగా పేకాట రాయుళ్లు కూడా రామ్‌ లక్ష్మణ్‌ టీం పేరుతో ఏకంగా ఓ మొబైల్‌ పేకాట కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టే ఇక్కడ పేకాట ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబాలను రోడ్డున పడేసే పేకాట జోలికి వెళ్తే..కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున‌్నారు పోలీసులు.

Also Read :

New virus strain : రాజమండ్రిలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం..యూకే నుంచి వచ్చిన మహిళకు వైరస్ పాజిటివ్

రూ. లక్షల డబ్బు ఉన్న సంచి లాక్కుని కోతి పరార్..కన్నీరుమున్నీరయిన వృద్ధుడు. చివరకు ఏం జరిగిందంటే..?

Survey training institute : తిరుపతిలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపు…అర్బన్ మండలంలోని ఆ గ్రామంలో