యాపిల్‌కు కష్టం… లక్షల కోట్లు నష్టం!

| Edited By:

May 15, 2019 | 3:01 PM

యాపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్ల అమ్మకాలు తగ్గిపోవడంతో పాటు కంపెనీకి మరో సమస్య వచ్చిపడింది. అదే అమెరికా-చైనా మధ్య నెలకొన్న తాజా వాణిజ్య యుద్ధం. దీంతో కంపెనీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ పడిపోతూ వస్తోంది. కంపెనీ విలువ గత శుక్రవారం నుంచి ఏకంగా 75 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.5,25,000 కోట్లు. అమెరికా ఇటీవలే చైనా నుంచి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల విలువైన […]

యాపిల్‌కు కష్టం... లక్షల కోట్లు నష్టం!
Follow us on

యాపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్ల అమ్మకాలు తగ్గిపోవడంతో పాటు కంపెనీకి మరో సమస్య వచ్చిపడింది. అదే అమెరికా-చైనా మధ్య నెలకొన్న తాజా వాణిజ్య యుద్ధం. దీంతో కంపెనీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కంపెనీ మార్కెట్ క్యాప్ పడిపోతూ వస్తోంది. కంపెనీ విలువ గత శుక్రవారం నుంచి ఏకంగా 75 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.5,25,000 కోట్లు.

అమెరికా ఇటీవలే చైనా నుంచి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్టులపై టారిఫ్‌లు పెంచింది. యాపిల్ ఇన్వెస్టర్లకు ఇది ప్రతికూలమనే చెప్పాలి. టారిఫ్‌ల పెరుగుదల నేపథ్యంలో అమెరికాలో యాపిల్ ప్రొడక్టుల ధర కూడా పెరిచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా కంపెనీ మార్కెట్ క్యాప్ 900 బిలియన్ డాలర్లకు దగ్గరిలో ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ తర్వాత మూడో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతోంది.