లిఫ్ట్ బటన్ తో ఎంత ముప్పొచ్చింది..!

ఎన్ని జాగ్రత్తలు తీసుకొని బ్రతుకుతున్నా కరోనా మహమ్మారికి జనం ఏదోరకంగా దొరికేస్తున్నారు. తాజాగా ఖమ్మంలోని ఒక ఆపార్టమెంట్‌లో నివశించేవాళ్లని కరోనా చుట్టేసింది. ఒక్క వ్యక్తి తెలియక చేసిన.

లిఫ్ట్ బటన్ తో ఎంత ముప్పొచ్చింది..!

Updated on: Aug 29, 2020 | 7:55 PM

ఎన్ని జాగ్రత్తలు తీసుకొని బ్రతుకుతున్నా కరోనా మహమ్మారికి జనం ఏదోరకంగా దొరికేస్తున్నారు. తాజాగా ఖమ్మంలోని ఒక ఆపార్టమెంట్‌లో నివశించేవాళ్లని కరోనా చుట్టేసింది. ఒక్క వ్యక్తి తెలియక చేసిన తప్పిదానికి మొత్తం అపార్ట్‌మెంట్‌లోని అందరికీ వైరస్‌ సోకింది. మొదటగా లిఫ్ట్‌ బటన్‌ నొక్కిన వారందరికీ కరోనా అటాక్ అయిందని.. ఆ తర్వాత వారివారి ద్వారా అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్స్‌లో ఉన్న వారందరికీ కరోనా వైరస్‌ సోకింది. దీంతో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో మొదట్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండగా ఇప్పుడు జిల్లాల్లోనూ వైరస్ ఎక్కువగా ప్రబలుతోంది.