కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు.. కోస్తాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు.. రాయలసీమలో పొడిగా

|

Dec 19, 2020 | 7:58 AM

ఏపీలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాలు.. కోస్తాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు.. రాయలసీమలో పొడిగా
Follow us on

ఏపీలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో సముద్రంనుంచి తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి. దాంతో దక్షిణ కోస్తాలో శుక్రవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక రానున్న 24 గంటల్లో కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా రాయలసీమప్రాంతంలో పొడివాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక ఏజన్సీలు, శివారు ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గింది.