10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెమోలు వచ్చాయోచ్..

ఏపీ పదోతరగతి మర్క్స్ మెమోలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన..

10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెమోలు వచ్చాయోచ్..
Follow us

|

Updated on: Aug 13, 2020 | 5:03 PM

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుడ్ న్యూస్. జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఉన్నత విద్యను దాటి ఇంటర్మిడియట్‌లోకి ఎంట్రీ అవడమే..ఇది దాటాలంటే 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే జీవిత లక్ష్యం వైపు సరైన అడుగు పడుతుంది. ఇదిలావుంటే.. ఈ మధ్య కరోనా ప్రభావంతో  తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతితోపాటు ఇంటర్, డిగ్రీ విద్యార్థులు అంతా ఉత్తీర్ణులను చేశాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.

ఏపీ పదోతరగతి మర్క్స్ మెమోలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డ్ వెబ్ సైట్ లో మార్స్స్ మెమెలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడిచింది. ఇందు కోసం https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చని తెలిపింది. లాంగ్ మెమోలను సంబంధిత స్కూళ్లకు పంపనుంది. విద్యార్థులు తమ స్కూళ్ల నుంచి ఒరిజినల్ మార్క్స్ మెమోలు తీసుకోవచ్చని తెలిపింది.