స్పీకర్ల సదస్సుకు హాజరైన రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి, శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై తమ్మినేని కీలకోపన్యాసం

గుజరాత్ లో నిర్వహిస్తోన్న 80వ స్పీకర్ల సదస్సులో పాల్గొన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర రాష్ట్రాల స్పీకర్లు హాజరైన ఈ సమావేశంలో తమ్మినేని.. శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై ప్రసంగించారు. శాసనవ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన అధికారాలు ఇచ్చింది.. కానీ ఈ మధ్య న్యాయస్థానాలు పదేపదే జోక్యం చేసుకుంటున్నాయి అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. శాసనసభ, శాసనమండలి చట్టాలను చేస్తాయి.. తరచు న్యాయస్థానాలు శాసన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం అవాంఛనీయం […]

స్పీకర్ల సదస్సుకు హాజరైన రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి, శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై తమ్మినేని కీలకోపన్యాసం

Updated on: Nov 25, 2020 | 9:34 PM

గుజరాత్ లో నిర్వహిస్తోన్న 80వ స్పీకర్ల సదస్సులో పాల్గొన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర రాష్ట్రాల స్పీకర్లు హాజరైన ఈ సమావేశంలో తమ్మినేని.. శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై ప్రసంగించారు. శాసనవ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన అధికారాలు ఇచ్చింది.. కానీ ఈ మధ్య న్యాయస్థానాలు పదేపదే జోక్యం చేసుకుంటున్నాయి అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. శాసనసభ, శాసనమండలి చట్టాలను చేస్తాయి.. తరచు న్యాయస్థానాలు శాసన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం అవాంఛనీయం అని ఆయన చెప్పారు.

న్యాయస్థానాలు పోరాట ధోరణితో జోక్యం చేసుకుంటున్నాయన్నారు. ఏపీ అసెంబ్లీ, మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు చేశాం.. కానీ కోర్టులు ఆ బిల్లుల అమలుకు ఆటంకం కల్పించాయి.. రాజకీయ దురుద్దేశంతో ఈ అంశంలో పిటిషన్లు దాఖలయ్యాయి.. కోర్టులు అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.