ఏపీలో 4.50 లక్షలు దాటిన కరోనా కేసులు

|

Sep 02, 2020 | 6:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటుంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అత్యధికంగా రికార్డు అవుతున్నాయి. అటు కేసులు, ఇటు మరణాలతో ప్రజలు వణికిపోతున్నారు.

ఏపీలో 4.50 లక్షలు దాటిన కరోనా కేసులు
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటుంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అత్యధికంగా రికార్డు అవుతున్నాయి. అటు కేసులు, ఇటు మరణాలతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 10,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 72 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపి ఏపీలో 4,55,531కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 1,03,076 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 3,48,330 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 38.43 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 72 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,125 మరణాలు సంభవించాయి. కొత్తగా నెల్లూరు 11, చిత్తూరు 10, పశ్చిమగోదావరి జిల్లాలో 9, ప్రకాశం 8 మంది మృతి చెందారు. కృష్ణా 6, విశాఖ 6, విజయనగరం 3, కడప 2, కర్నూలులో ఒకరు మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మృతి చెందారు.