డిసెంబర్ 9వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉందట. ఈ సమావేశాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తుందట. అంతేకాకుండా.. ప్రతిపక్ష పార్టీ టీడీపీ చేస్తోన్న ఆరోపణలకు కూడా ధీటుగా సమాధానం ఇవ్వాలని.. వైసీపీ పార్టీ నేతలు అనుకుంటున్నారట. కాగా.. ఈ సమావేశాలు దాదాపు 10 నుంచి 15 రోజులపాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ యంత్రాంగం ఐదురోజుల నుంచి ముందే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
తాజాగా.. అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీఎల్పీ కార్యాలయంలో.. వైసీపీ నేతలు.. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్‌లు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఉదయభాను, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల గురించి ప్రస్తావించినట్టు సమాచారం. అనంతరం.. స్పీకర్ తమ్మినేని సీతారంను కలిసి.. దీనిపై పస్తావించారు.