అంతా చట్ట పరిధిలోనే.. బాబు భద్రత తగ్గింపుపై ఏపీ హోం మంత్రి

మాజీ సీఎం,టీడీపీ అధక్షుడు చంద్రబాబుకు చట్టపరిధిలోనే భద్రతను తగ్గించడం జరుగుతుందన్నారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. చంద్రబాబుకు సెక్యూరిటీని తగ్గించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భద్రతా చర్యలకు సంబంధించిన అంశమని, ఈ అంశాన్ని సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ విషయంలో కక్షపూరితంగా వ్యవహరించారనడానికి తావులేదన్నారు మంత్రి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన వద్ద ఉన్న 15 మంది సెక్యూరిటీ సిబ్బందిని […]

అంతా చట్ట పరిధిలోనే.. బాబు భద్రత తగ్గింపుపై ఏపీ హోం మంత్రి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2019 | 8:00 PM

మాజీ సీఎం,టీడీపీ అధక్షుడు చంద్రబాబుకు చట్టపరిధిలోనే భద్రతను తగ్గించడం జరుగుతుందన్నారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. చంద్రబాబుకు సెక్యూరిటీని తగ్గించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది భద్రతా చర్యలకు సంబంధించిన అంశమని, ఈ అంశాన్ని సమీక్ష కమిటీ నిర్ణయిస్తుందన్నారు. ఈ విషయంలో కక్షపూరితంగా వ్యవహరించారనడానికి తావులేదన్నారు మంత్రి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన వద్ద ఉన్న 15 మంది సెక్యూరిటీ సిబ్బందిని తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.  చంద్రబాబుకు  ప్రస్తుతం ఇద్దరేసి కానిస్టేబుళ్ల చొప్పున రెండు బృందాలను కేటాయించారు.

ఇదిలా ఉంటే అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడి తర్వాత చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతతో సహా ఎన్ఎస్జీ భద్రతను కల్పించారు. ఆయన పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అడిషనల్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్ఐల బృందాలతో కూడిన భద్రతా సిబ్బందిని ఆయకు కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్నపాటుగా ఆయన వ్యక్తిగత భద్రతను తగ్గించడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లోకేశ్‌కు కూడా భద్రతను తగ్గించారు. అదేవిధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలకు సైతం భద్రతా సిబ్బందిని పూర్తిగా లేకుండా చేశారు. ఈ విధంగా తమ పార్టీ అధినేతకు భద్రతను తగ్గించడం, కుటుంబ సభ్యులకు సైతం సెక్యూరిటీని లేకుండా చేయడం రాజకీయ కక్షలో భాగమేని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.