AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూల్చివేసినా.. అది చంద్రబాబు సొంతిల్లు కాదు : మాజీ ఎంపీ రాయపాటి

వివాదాస్పదంగా మారిన అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం టీడీపీ నేతల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కి కూడా సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేసి గుంటూరు పార్టీ ఆఫీసుకు దగ్గర్లో ఉంటారని తెలిపారు. అక్రమ నిర్మాణాల పేరిట లింగమనేని గెస్ట్‌హౌస్‌కి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసినా అది చంద్రబాబుది కాదని, […]

కూల్చివేసినా.. అది చంద్రబాబు సొంతిల్లు కాదు : మాజీ ఎంపీ రాయపాటి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 28, 2019 | 7:25 PM

Share

వివాదాస్పదంగా మారిన అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం టీడీపీ నేతల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌కి కూడా సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మాజీ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేసి గుంటూరు పార్టీ ఆఫీసుకు దగ్గర్లో ఉంటారని తెలిపారు. అక్రమ నిర్మాణాల పేరిట లింగమనేని గెస్ట్‌హౌస్‌కి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసినా అది చంద్రబాబుది కాదని, దానివల్ల ఆయనకు నష్టం ఏమీ లేదని, ఆయన ఖచ్చితంగా ఖాళీ చేస్తారని రాయపాటి తెలిపారు.

ఇదిలా ఉంటే తన ఇంటికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించానని తెలిపారు రాయపాటి. ఇప్పటికే ఆయన నివాసం కూల్చివేస్తారన్న విషయం తెలుసుకున్న చాలమంది రైతులు చంద్రబాబును కలిశారని, వెంకటపాలెం రైతులు ఏకంగా ఆయనకు ఇల్లుకడతామంటున్నారని  రాయపాటి తెలిపారు.

ఇప్పటికే అక్రమ నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను నేలమట్టం చేశారు అధికారులు. ఈ కూల్చివేతలు రాజకీయంగా అధికార టీడీపీ,ప్రతిపక్ష వైసీపీల మధ్య వివాదాన్ని రాజేసాయి. మరోవైపు కరకట్టపై నిర్మించిన కట్టడాల విషయంలో సీఆర్డీఏ నోటీసులు కూడా జారీ చేసింది.

Follow Us
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..