Breaking News : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు…
AP High Court: ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల్లోపు ముగ్గురు...
AP High Court: ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల్లోపు ముగ్గురు ప్రిన్సిపాల్ సెక్రటరీ స్థాయి అధికారులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవాలని పేర్కొంది. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపధ్యంలో.. అందుకు సంబంధించిన వివరాలను ఆయా ప్రభుత్వాధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ అయి వివరించాలని తెలిపింది. అలాగే వారు ఎక్కడ కలవాలన్న విషయాన్ని నిమ్మగడ్డ తెలియజేస్తారని కోర్టు స్పష్టం చేసింది. కాగా, అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య ఇంకా చర్చలు కొలిక్కి రాకపోతే తిరిగి వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది.