Big Breaking :విశాఖలో డా.సుధాకర్ పై దాడి ఘ‌ట‌న‌పై సీబీఐ ఎంక్వైరీ..

|

May 22, 2020 | 1:48 PM

విశాఖ‌లో సస్పెండెడ్ డాక్ట‌ర్ సుధాక‌ర్ పై దాడి అంశంపై హైకోర్టు ఇవాళ విచార‌ణ జ‌రిపింది. ఈ అంశంపై సీరియ‌స్ గా రెస్పాండ్ అయిన కోర్టు… సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. 8 వారాల్లో ద‌ర్యాప్తు నివేదికను త‌మ‌కు అంద‌జేయాల‌ని ధ‌ర్మాస‌నం సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్‌ నివేదికలో వెల్ల‌డించార‌ని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల గురించి ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. దాడికి సంబంధించి […]

Big Breaking :విశాఖలో డా.సుధాకర్ పై దాడి ఘ‌ట‌న‌పై సీబీఐ ఎంక్వైరీ..
Follow us on

విశాఖ‌లో సస్పెండెడ్ డాక్ట‌ర్ సుధాక‌ర్ పై దాడి అంశంపై హైకోర్టు ఇవాళ విచార‌ణ జ‌రిపింది. ఈ అంశంపై సీరియ‌స్ గా రెస్పాండ్ అయిన కోర్టు… సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని సీబీఐని ఆదేశించింది. 8 వారాల్లో ద‌ర్యాప్తు నివేదికను త‌మ‌కు అంద‌జేయాల‌ని ధ‌ర్మాస‌నం సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్నాయని మేజిస్ట్రేట్‌ నివేదికలో వెల్ల‌డించార‌ని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల గురించి ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. దాడికి సంబంధించి అనుమానాలు ఉన్న నేప‌థ్యంలో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన‌ట్లు హైకోర్టు తెలిపింది.

కాగా ఇప్ప‌టికే ఈ అంశానికి సంబంధించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ లేఖ రాసింది. పోలీసులు డాక్ట‌ర్ ప‌ట్ల‌ అమానుషంగా ప్రవర్తించారని ఐఎంఏ సీఎంకు వివ‌రించింది. సీఎం పట్ల డాక్ట‌ర్ చేసిన కామెంట్స్ కూడా క‌రెక్ట్ కాద‌ని..కానీ ఓ డాక్ట‌ర్ పట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం దేశ‌వ్యాప్తంగా ఉన్న వైద్యులను మనోవేదనకు గురి చేస్తోందని లేఖలో తెలిపింది. ఐఎంఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ ఘ‌ట‌నకు సంబంధించి ప్రైమ‌రీ రిపోర్టును కూడా సీఎంకు పంపింద‌ని పేర్కొంది. మొత్తం వ్యవహారంపై స్వతంత్ర, న్యాయ విచార‌ణ‌ జరుగుతుందని ఆశిస్తున్నామని.. పోలీసులపైనా తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు సీఎంకు రాసిన లేఖలో ఐఎంఏ వెల్ల‌డించింది.