Breaking: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

|

Jul 20, 2020 | 1:16 AM

Grama Ward Sachivalayam Exams 2020: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఆగష్టు రెండోవారంలో జరగాల్సిన ఈ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే కొత్త తేదీలు, షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు. […]

Breaking: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..
Follow us on

Grama Ward Sachivalayam Exams 2020: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఆగష్టు రెండోవారంలో జరగాల్సిన ఈ ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే కొత్త తేదీలు, షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.

కాగా, 19 రకాల పోస్టులకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. వీటికి సంబంధించి మొత్తం 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఆయా పోస్టుల భర్తీకి 14 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షలను ఆగష్టు రెండో వారంలో నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో మరోసారి ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..