‘జగనన్న చేదోడు’..వారికి ఏడాదికి రూ. 10వేలు..!

|

Jan 31, 2020 | 9:51 PM

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమాజంలోని పలు వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. గతేడాది ఆటో, టాక్సీ వాలాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేశారు. తాజాగా ఆయన మరికొన్ని బడుగు వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటించినట్టు సమాచారం. టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ. 10వేల సాయం చేయడానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి […]

జగనన్న చేదోడు..వారికి ఏడాదికి రూ. 10వేలు..!
Follow us on

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సమాజంలోని పలు వెనకబడిన వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. గతేడాది ఆటో, టాక్సీ వాలాలకు రూ. 10 వేల చొప్పున సాయం చేశారు. తాజాగా ఆయన మరికొన్ని బడుగు వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటించినట్టు సమాచారం. టైలర్లకు, రజకులకు, నాయీ బ్రహ్మణులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ. 10వేల సాయం చేయడానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి ‘జగనన్న చేదోడు’ అనే పేరు ఖరారు చేశారట. త్వరలోనే ఈ పథకం సీఎం జగన్ చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు సచివాలయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.