ఏపీ: సెప్టెంబర్ రెండోవారంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ..?

|

Jul 21, 2020 | 1:34 AM

UG PG Exams In September: డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి 27 మధ్యలో ఎంసెట్‌తో పాటు డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. కరోనా […]

ఏపీ: సెప్టెంబర్ రెండోవారంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ..?
Follow us on

UG PG Exams In September: డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి 27 మధ్యలో ఎంసెట్‌తో పాటు డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు.

కరోనా కారణంగా ఆకడిమిక్ కరిక్యులమ్ రీ-డిజైన్ చేస్తున్నామన్న ఆయన.. ఈ ఏడాది నుంచి డిగ్రీలో 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తున్నామన్నారు. అటు కోవిడ్ కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్ధులకు మరోసారి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని హేమచంద్రారెడ్డి వెల్లడించారు.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..