ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు చెక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

|

Nov 01, 2020 | 3:01 PM

ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులు..

ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు చెక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Follow us on

Enrollment In Government Schools: ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులు.. సర్కారీ బడులలో చేరాలంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్(టీసీ) అవసరం లేదని వెల్లడించింది. కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే చాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్ధులకు టీసీలు ఇవ్వడంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్న నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా సర్కారీ బడులను ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వాటిల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడానికి కూడా సిద్దమవుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు అమ్మఒడి పధకం ద్వారా ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై వైపు మొగ్గు చూపుతున్నారు.

Also Read:

వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా…

ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు.. మార్గదర్శకాలు ఇవే..

ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త..

ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..