ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 590 ఆరోగ్యమిత్రలు, 58 టీమ్ లీడర్ల పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన

ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 31, 2020 | 3:39 PM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 590 ఆరోగ్యమిత్రలు, 58 టీమ్ లీడర్ల పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చింది. తాజాగా ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 13వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని ఆరోగ్య శ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్యను పెంచుతున్న క్రమంలో ఆరోగ్య మిత్రలను పెద్ద ఎత్తున నియమించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పోస్టులకు సంబంధించిన మొత్తం సమాచారం ఆయా జిల్లాల వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చునని పేర్కొంది.

Arogya Mitra Notification

ఆరోగ్యమిత్రలకు బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, ఎం. ఫార్మ‌సీ, ఎమ్మెస్సీ (న‌ర్సింగ్) ఉత్తీర్ణ‌త‌తో పాటు రెండు సంవత్సరాలు ఆసుపత్రుల్లో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. అదనంగా ఏదైనా పోస్ట్ గ్రాడ్యువేషన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం కలిగి ఉండాలి.

Latest Articles