AP Contract Employees: ఏపీ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రెవిన్యూ, పంచాయతీ రాజ్, ఏసీబీ, హోంశాఖ, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితిని 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా కాంట్రాక్టు ఉద్యోగిని కొనసాగించకుండదని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది.
మరోవైపు సీఎం వైఎస్ జగన్ రైతులకు కూడా గుడ్ న్యూస్ అందించారు. 2019 ఖరీఫ్ నుంచి ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పధకాన్ని జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా నమోదైన రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.కాగా, రాష్ట్ర రహదారులు, రోడ్ల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం రూ. 388 కోట్ల పాలనా అనుమతులను ఇచ్చింది. ముఖ్యంగా తుఫాన్లు, భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయాలంటూ సిఫార్సు చేసింది.