ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు..
ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. జూలై 2018 నుంచి పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేసింది.

Good News To Employees: ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. జూలై 2018 నుంచి పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేసింది. దీనితో రూ. 27.248 నుంచి రూ. 30.392కు డీఏ పెరిగింది. ఆ డీఏను జనవరి 2021 జీతాలతో కలిపి నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించింది.
2018 జూలై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలలు బకాయిలు ఉండగా.. వీటిని జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాలలో పీఎఫ్ ఖాతాలలో జమ చేయనున్నారు. అలాగే సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90% నగదు రూపంలో, 10% ప్రాన్ అకౌంట్‌కు, 3 సమ భాగాలలో(జనవరి జీతాల చెల్లింపు తర్వాత) చెల్లిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: రోహిత్.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?
