‘అమ్మఒడి’లో చేరేందుకు లాస్ట్ ఛాన్స్.. డెడ్‌లైన్ ఎప్పుడంటే.!

|

Jan 11, 2020 | 1:53 PM

నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకాన్ని ఏపీ సీఎం జగన్ జనవరి 9న చిత్తూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏటా రూ.15 వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకు 42,12,186 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. అయితే అమ్మఒడి అర్హత ఉండీ కూడా దరఖాస్తు చేసుకొని వారికి సర్కార్ మరో అవకాశాన్ని ఇచ్చింది. వచ్చే నెల 9వ […]

అమ్మఒడిలో చేరేందుకు లాస్ట్ ఛాన్స్.. డెడ్‌లైన్ ఎప్పుడంటే.!
Follow us on

నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకాన్ని ఏపీ సీఎం జగన్ జనవరి 9న చిత్తూరులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏటా రూ.15 వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటివరకు 42,12,186 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. అయితే అమ్మఒడి అర్హత ఉండీ కూడా దరఖాస్తు చేసుకొని వారికి సర్కార్ మరో అవకాశాన్ని ఇచ్చింది. వచ్చే నెల 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా పథకం వర్తిస్తుందని చెప్పింది.

ఈ పథకానికి ప్రభుత్వం రూ. 6,400 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా ఒకవేళ లబ్ధిదారులకు బ్యాంకు అప్పులు ఉంటే.. ఆ డబ్బును బ్యాంక్ తీసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ అకౌంట్లలోకి వేస్తామని స్పష్టం చేసింది. ఈ పథకం వర్తించడానికి విద్యార్థులకు 75 శాతం హాజరు కలిగి ఉండాలన్న నిబంధనను వచ్చే ఏడాది నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది మాత్రం ఆ నిబంధనను మినహాయించినట్లు వెల్లడించింది.