కుల ధృవీకరణ లేకుండానే మైనారిటీలకు ‘వైఎస్ఆర్ చేయూత’…

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 'వైఎస్సార్ చేయూత' పధకానికి దరఖాస్తు చేసుకునే ముస్లిం, మైనారిటీ వర్గాల మహిళలకు కుల ధృవీకరణ పత్రం అవసరం లేకుండా మినహాయింపు...

కుల ధృవీకరణ లేకుండానే మైనారిటీలకు వైఎస్ఆర్ చేయూత...

Updated on: Jun 30, 2020 | 11:48 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వైఎస్సార్ చేయూత’ పధకానికి దరఖాస్తు చేసుకునే ముస్లిం, మైనారిటీ వర్గాల మహిళలకు కుల ధృవీకరణ పత్రం అవసరం లేకుండా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 45-60 ఏళ్ల వయసు ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ సామాజిక వర్గాల మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ పధకం ద్వారా ప్రభుత్వం నాలుగేళ్లలో దశలవారీగా రూ. 75 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనుంది.

‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పధకంలో లబ్ది చేకూరని వారికి ఈ పధకం ద్వారా ఆర్ధిక సాయం అందుతుంది. ఇదిలా ఉంటే ‘వైఎస్సార్ చేయూత’ పధకం రూల్స్ ప్రకారం లబ్ధిదారులు సాయం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బీసీ-బీ(దూదేకుల), బీసీ-ఈ ముస్లింలకు మాత్రమే కుల ధృవీకరణ పత్రం లభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ పథకం మార్గదర్శకాల్లో పలు సవరణలు చేసింది. మిగిలిన మైనార్టీ వర్గాల వారికి కుల ధృవీకరణ పత్రం తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Also Read: బ్రేకింగ్: చైనాలో మరో కొత్త వైరస్.. మానవజాతికి మరో డేంజర్..