కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ పార్థివదేహానికి ఏపీ మాజీ సీఎం, టీడీపీ చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జైట్లీ విద్యార్ధి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగన నేత అని అన్నారు. అందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి అని.. వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్నేహితుడిగ సాయం చేశారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ కోసం పోరాడారని కొనియాడారు. దేశం ఓ గొప్పనేతని కోల్పోయిందన్న ఆయన.. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.