మీ ఏరియాలో కరెంట్ పోయిందా..ఈ నెంబ‌ర్ కు ఫోన్ చెయ్యండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రెంట్ కోత‌ల‌పై అధికారులు ఫోకస్ పెట్టారు. కొన్ని చోట్ల ప‌దే, ప‌దే ప‌వ‌ర్ క‌ట్ అవుతుంద‌ని కంప్లైంట్స్ రావ‌డంతో.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్ర‌ణాళిక‌లు రచించారు. విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదు వ‌చ్చిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ శాఖకు సంబంధించి అందుతున్న కంప్లైంట్స్ పై రివ్యూ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి […]

మీ ఏరియాలో కరెంట్ పోయిందా..ఈ నెంబ‌ర్ కు ఫోన్ చెయ్యండి..

Updated on: Apr 27, 2020 | 9:48 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రెంట్ కోత‌ల‌పై అధికారులు ఫోకస్ పెట్టారు. కొన్ని చోట్ల ప‌దే, ప‌దే ప‌వ‌ర్ క‌ట్ అవుతుంద‌ని కంప్లైంట్స్ రావ‌డంతో.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్ర‌ణాళిక‌లు రచించారు. విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదు వ‌చ్చిన వెంటనే సిబ్బంది వెళ్లి పరిష్కరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ శాఖకు సంబంధించి అందుతున్న కంప్లైంట్స్ పై రివ్యూ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

విద్యుత్‌ అంతరాయాలు లేకుండా చూసేందుకు ప్రతి జిల్లాలో స్పెష‌ల్ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. విద్యుత్ విషయంలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్ర‌జ‌లు 1912 నంబర్‌కు కాల్‌ చేయొచ్చు. స్థానికంగా కేటాయించిన నంబర్లను జిల్లా యంత్రాంగం ఎప్ప‌టిక‌ప్పుడు పర్య‌వేక్షిస్తుంది. ఒకవేళ సమస్య వస్తే ఎన్ని గంటల్లో సాల్వ్ చేశార‌నే విషయం కూడా నమోదవుతుంది. ప్రజలు ఫోన్, విద్యుత్‌ శాఖ వెబ్‌ సైట్‌ ద్వారా కూడా కంప్లైంట్స్ ఇవ్వ‌వ‌చ్చు. ఇక మ‌రోవైపు కరోనా క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రుల దగ్గర స్పెషల్ టీమ్‌లను అందుబాటులో ఉంచింది ఏపీ విద్యుత్ శాఖ‌.