ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఎంసెట్ 2020 హాల్‌ టికెట్స్‌ విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

Edited By:

Updated on: Sep 10, 2020 | 9:04 PM

AP Eamcet Hall Tickets: ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఎంసెట్ 2020 హాల్‌ టికెట్స్‌ విడుదలయ్యాయి. ఈ నెల 17 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షా కేంద్రాల్లో మాస్కులు ధరించడం, విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే 17, 18,21,22,23 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్.. 23, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాగా, హాల్‌ టికెట్స్‌ కోసం విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/ను సందర్శించాలని అధికారులు వెల్లడించారు.

Also Read: 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 11న ఖాతాల్లోకి నగదు జమ.!

బ్యాంక్ కస్టమర్లకు షాక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త రూల్..

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..