పోలీస్ హోంగార్డు ఆత్మహత్య..!

ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లాకు చెందిన మహమ్మద్ ఆత్మహత్య.

పోలీస్ హోంగార్డు ఆత్మహత్య..!

Updated on: Jun 04, 2020 | 7:35 PM

ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి వరకు విధులు నిర్వహించిన హోంగార్డు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కడప జిల్లాకు చెందిన మహమ్మద్ మంగళగిరి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విధులు ముగిసిన అనంతరం వడ్లపూడిలోని తన గదిలో మహమ్మద్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.