ఏపీలో భారీగా ఎస్‌ఐల బదిలీలు..
ప్రకాశం జిల్లాలో ఇద్దరు డీఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వీరిని సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు, నిర్మల్ ప్రాంతాల్లో గుట్కా ప్యాకెట్ల నిల్లలపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఈ విషయంలో పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ప్రాంతీయ విజిలెన్స్ అధికారిణి రజని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎస్పీ ఇచ్చిన నివేదిక […]

ప్రకాశం జిల్లాలో ఇద్దరు డీఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వీరిని సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు, నిర్మల్ ప్రాంతాల్లో గుట్కా ప్యాకెట్ల నిల్లలపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఈ విషయంలో పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ప్రాంతీయ విజిలెన్స్ అధికారిణి రజని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు రాధేష్ మురళిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మురళి స్థానంలో ఇన్‌ఛార్జి డీఎస్పీగా ఎం.బాలసుందరరావు వ్యవహరించనున్నారు.
మరోవైపు చీరాల డీఎస్పీని కూడా బదిలీ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు. రుద్రామాంబ వరంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో టీడీపీ కార్యకర్త పద్మ మృతిపై నిర్లక్ష్యం వహించినందకు చీరాల డీఎస్పీ యు.నాగరాజును బదిలీ చేశారు. ఇక ఒంగోలులో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న విక్రమ శ్రీనివాసరావును కూడా బదిలీ చేసి.. రాష్ట్ర పోలీసు కేంద్రంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.
ఇక జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 54 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పోస్టింగ్ పొందిన కొందరు ప్రొబేషనరీ ఎస్సైలు మినహా జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లకు నూతన ఎస్సైలను నియమించారు.