అవినీతికి కేరాఫ్..దద్దమ్మల కేంద్రం..టిడిపిపై బాషా ఆగ్రహం

తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. గత ఐదు సంవత్సరాలలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా టీడీపీ వ్యవహరించిందని.. దద్దమ్మల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేని అంజాద్‌ బాషా విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. గతంలో టీడీపీలో ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ […]

అవినీతికి కేరాఫ్..దద్దమ్మల కేంద్రం..టిడిపిపై బాషా ఆగ్రహం
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Oct 03, 2019 | 4:53 PM

తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. గత ఐదు సంవత్సరాలలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా టీడీపీ వ్యవహరించిందని.. దద్దమ్మల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేని అంజాద్‌ బాషా విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. గతంలో టీడీపీలో ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని అన్నారు. సచివాలయ ఉద్యోగాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని, సీఎం జగన్‌కు పెరిగిపోతున్న ప్రజాదరణ ఓర్వలేకే టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు.

క్రిమినల్ కేసులు నమోదైన టీడీపీ కార్యకర్తకు మాజీ సీఎం చంద్రబాబు వంత పాడటం విడ్డురంగా ఉందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా దుయ్యబట్టారు.  ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన కృష్ణంనాయుడిని మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ముద్దు కృష్ణంనాయుడుపై ఉన్న ఆరోపణలు రుజువు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణపై సీఎం స్పందించాలని కోరడం విడ్డురంగా ఉందన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu